Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిపిన్ రావత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖ నేతలు

హైదరాబాద్:  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ ఘటన తీవ్రంగా కలిచివేసిందని సీఎం జగన్‌ అన్నారు. జవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.


బిపిన్ రావత్, సతీమణి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ దుర్ఘటన దురదృష్టకరమని, రావత్ సహా ఇతర మృతులకు సంతాపం తెలుపుతున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.


బిపిన్‌ రావత్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దేశ రక్షణరంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలు మరువలేనివి అని కేసీఆర్‌ అన్నారు. ప్రమాదంలో ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని, జవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు.


ఆర్మీ హెలికాప్టర్‌ ఘటనపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


బిపిన్ రావత్ మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వీరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్‌ తెలిపారు.


ఆర్మీ హెలికాప్టర్‌ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని, సీడీఎస్ రావ‌త్ మ‌ర‌ణం ర‌క్షణ‌శాఖ‌కి తీర‌నిలోటు అని మాజీ మంత్రి లోకేష్ అన్నారు.

Advertisement
Advertisement