సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఎన్నికల ఉల్లంఘనే..

ABN , First Publish Date - 2021-02-25T05:39:48+05:30 IST

రాష్ట్రంలో మునిసిప ల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్న నే పఽథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి క్యాబినెట్‌ సమావేశంలో సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్క రించడం కోడ్‌ ఉల్లంఘన అవుతుందని తెలుగు మ హిళ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల ప ద్మజ విమర్శించారు.

సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఎన్నికల ఉల్లంఘనే..
మాట్లాడుతున్న రావుల పద్మజ తదితరులు

తెలుగు మహిళ విమర్శ


ఒంగోలు (కార్పొరేషన్‌) ఫిబ్ర వరి 24 : రాష్ట్రంలో మునిసిప ల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్న నే పఽథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి క్యాబినెట్‌ సమావేశంలో సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్క రించడం కోడ్‌ ఉల్లంఘన అవుతుందని తెలుగు మ హిళ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల ప ద్మజ విమర్శించారు. బుధవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టేందు కు ఓట్లు రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవ హరిస్తుందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకా రం పేదలకు పట్టాలు ఇవ్వలేని ప్రభుత్వం, తెలు గుదేశం పార్టీపై విమర్శలు చేయడం చేతగా నితన మని చెప్పారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వ మోసపూ రిత హామీలు నమ్మవద్దని కోరారు. ఎన్నికల కోడ్‌ ఉ ల్లంఘించిన సీఎం, మంత్రివర్గంపై ఎన్నికల సం ఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స మావేశంలో మహిళా ప్రధాన కార్యదర్శి అరుణారెడ్డి, పూసపాటి జాలిరెడ్డి త దితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T05:39:48+05:30 IST