అమరావతి: రాష్ట్రంలోని రైతులు బోర్ల కింద వరి పంట వేయొద్దని సీఎం జగన్ కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై జగన్ సమీక్ష జరిపారు. బోర్ల దగ్గర ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మిల్లెట్స్ పంటలపై ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.