పెన్షన్ల కోసం రూ.1450 కోట్లు ఇస్తున్నాం: సీఎం జగన్

ABN , First Publish Date - 2021-10-07T19:42:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.1450 కోట్లు ఇస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

పెన్షన్ల కోసం రూ.1450 కోట్లు ఇస్తున్నాం: సీఎం జగన్

ప్రకాశం జిల్లా: వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.1450 కోట్లు ఇస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఒంగోలులో ఆసరా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీడీపీ హయాంలో కేవలం రూ.450 కోట్లు కేటాయింపు చేశారని విమర్శించారు. వైఎస్సార్ పెన్షన్లతో 61 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. 78.76 లక్షల మంది మహిళలకు ఆర్థిక చేయూత ఇస్తున్నామన్నారు. వైఎస్సార్ ఆసరా కింద రెండు విడతల్లో రూ.12,759 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు.


ఈనెల 18వ తేదీ లోపు అన్నీ మహిళా సంఘాల ఖాతాలకు నగదు జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. మహిళలకు హామీ ఇచ్చిన విధంగా నాలుగు విడతల్లో రుణమాఫీ మొత్తాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు మహిళలు తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తున్నాయన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పలు రకాలుగా జీవనోపాధి మార్గాలు చూపిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. హోంమంత్రిగా మహిళకు అవకాశం ఇచ్చామని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా మహిళ పేరునే సిఫారసు చేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాల్లో ఏడుగురు మహిళలకు కేటాయించామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-07T19:42:52+05:30 IST