అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తిరుపతిలో వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. అలాగే పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు. కాగా...సీఎం పర్యటన నేపథ్యంలో వరద బాధితులకు వైసీపీ నేతల హెచ్చరికలు జారీ చేశారు. సీఎంను వరద నష్టాలు, సాయం కోసం ప్రశ్నిస్తే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.