అమరావతి: చంద్రబాబువి బురద రాజకీయాలని సీఎం జగన్ విమర్శించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు శరవేగంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో బాధితులను ఆదుకునేందుకు కనీసం నెల పట్టేదన్నారు. ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులను ఆదుకోగలిగామన్నారు. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి, సీజన్లోగా వారికి సహాయం అందిస్తున్నామన్నారు.