AP News: పోలవరంపై జగన్‌రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారు?: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-25T23:39:34+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan)ను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై జగన్‌రెడ్డి ఇప్పుడేం సమాధానం

AP News: పోలవరంపై జగన్‌రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారు?: చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్‌ (CM Jagan)ను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై జగన్‌రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. కేంద్రవ్యవస్థల నుంచి నిపుణుల నివేదికల వరకూ జగన్‌దే తప్పని తేల్చారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ (Polavaram Project)లో జగన్‌ ప్రభుత్వ తప్పిదాలను.. పీపీఏ (PPA), కేంద్రం, నిపుణుల కమిటీ తేల్చిచెప్పాయని గుర్తుచేశారు. పోలవరం పరిహారంపై జగన్‌ హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చవద్దన్న పీపీఏ, కేంద్రజలవనరుల శాఖ లేఖలను జగన్‌ పట్టించుకోలేదని తప్పుబట్టారు. వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్‌ విఫలమైదని దుయ్యబట్టారు. జగన్‌ ప్రభుత్వ తీరుతోనే విలీన గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 


‘‘ఏపీలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో విద్యాశాఖ విఫలమైంది. ఏపీలో బడులు మూసేస్తున్నారు.. బార్లు తెరుస్తున్నారు. ఏపీలోని రేషన్‌కార్డుదారులందరికీ బియ్యం పంపిణీ చేయాలి. అప్పుల విషయంలో ప్రభుత్వ సమాధానం పెద్ద బూటకం. అప్పులపై తక్షణమే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. పారిశ్రామిక వేత్త అదానీ డిస్టిలరీకి రెండేళ్లలోనే రూ.2,400 కోట్ల ఆర్డర్లు ఎందుకిచ్చారు?.. దీనిపై ఈడీ (ED) విచారణ జరిపించాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-25T23:39:34+05:30 IST