ఆ సదస్సులో కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం జగన్

ABN , First Publish Date - 2022-04-26T02:38:07+05:30 IST

ఆ సదస్సులో కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం జగన్

ఆ సదస్సులో కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం జగన్

అమరావతి: ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్‌  జాతీయ స్దాయి సదస్సులో కీలక అంశాలను సీఎం జగన్  ప్రస్తావించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతును దేశానికి గొప్ప సేవకుడిగానే చూడాలన్నారు. వారిని ప్రోత్సహించేలా ఒక విధానం తీసుకురావాలని ఆయన సూచించారు. రైతులకు రివార్డులు ఇవ్వాలని, పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సులలో వెయిటేజీ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సర్టిఫికేషన్‌ ప్రక్రియ సరళంగా, రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. వ్యవసాయ యూనివర్శిటీ కోర్సుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు పొందుపరచాలని సూచించారు. వ్యవస్థీకృతంగా పరిశోధనలు అత్యంత అవసరమన్నారు. ఆరోగ్యంపై ప్రభావాలను పరిశోధించి, ఫలితాలను ప్రజలముందు ఉంచాలని సీఎం పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు 20 మిలియన్‌ యూరోల నిధులు ఇవ్వడానికి జర్మనీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ నిధులతో ఇండో-జర్మనీ గ్లోబల్‌ అకాడమీ ఆన్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీఏఏఆర్‌ఎల్‌) సంస్థను ఏపీలో ఏర్పాటు చేయనుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఐజీజీఏఏఆర్‌ఎల్‌ పనిచేస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో 90శాతం నిధులను కేంద్రం భరించాలన్నారు. 

Updated Date - 2022-04-26T02:38:07+05:30 IST