దాతృత్వం చాటుకోండి

ABN , First Publish Date - 2020-03-31T09:27:27+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా పాలన స్తంభించి, పౌర సేవలకు విఘాతం కలుగుతున్న ఈ ఆపత్కాలంలో దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపిచ్చారు. సోమవారం రాష్ట్రంలోని పెద్ద మనుషులు, దాతలు, సేవా దృక్పథం కలిగిన వారికి సీఎం తరఫున

దాతృత్వం చాటుకోండి

  • 20-35 ఏళ్ల లోపు యువకులంతా క్వారంటైన్‌లో పనికి రండి: సీఎం 

కరోనా వైరస్‌ కారణంగా పాలన స్తంభించి, పౌర సేవలకు విఘాతం కలుగుతున్న ఈ ఆపత్కాలంలో దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపిచ్చారు. సోమవారం రాష్ట్రంలోని పెద్ద మనుషులు, దాతలు, సేవా దృక్పథం కలిగిన వారికి సీఎం తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు స్తంభించాయని.. ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దాతలు, ట్రస్టులు, ఎన్‌జీవోలు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ  సంస్థల అధిపతులు వివిధ రూపాల్లో సాయం చేయాలని  విజ్ఞప్తి చేశారు. సర్జికల్‌ మాస్కులు, ఎన్‌-95 మాస్కులు, పీపీఈ యూనిట్‌లు, శానిటైజర్లు, మొబైల్‌ ఎక్స్‌రే మిషన్లు,  వెంటిలేటర్లు, పల్స్‌, ఒక్స్‌ మీటర్లు, బీఐపీఏపీలనూ అందించాలని కోరారు. 20 నుంచి 35 ఏళ్ల లోపున్న నాన్‌ మెడికల్‌ సిబ్బంది క్వారంటైన్‌ సెంటర్లు, ఐసొలేషన్‌ కేంద్రాలలో సేవలందించేందుకు ముందుకు రావాలని కోరారు.

Updated Date - 2020-03-31T09:27:27+05:30 IST