పోరస్ అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి...ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ABN , First Publish Date - 2022-04-14T13:24:41+05:30 IST

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పోరస్ అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి...ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.



అసలేం జరిగిందంటే...

పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ఐదుగురు మంటల్లోనే సజీవ దహనమవగా... ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపట్టింది.  ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Updated Date - 2022-04-14T13:24:41+05:30 IST