Abn logo
Nov 21 2020 @ 11:55AM

హార్బర్లు, ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Kaakateeya

అమరావతి: నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రూ.1,510 కోట్లతో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని, నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలిదశలో మచిలీపట్నం, నిజాంపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూ.గో జిల్లా ఉప్పాడలో ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.225 కోట్లతో ఖర్చుతో మొదట 25 ఆక్వాహబ్‌ల నిర్మాణం చేపడతామన్నారు.


ఏపీలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, మత్స్యకారుల జీవితాలు దయనీయ స్థితిలో ఉన్నాయని సీఎం జగన్‌ అన్నారు. సరైన సౌకర్యాలు లేక గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారని, పెద్ద సముద్రం ఉన్నా అవసరమైన ఫిషింగ్‌ హార్బర్లు లేవన్నారు. విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న మత్స్యకారుల్ని బయటికి తీసుకొచ్చామన్నారు. దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఆంధప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉందన్నారు. మొత్తం 8 ఫిషింగ్‌ హార్బర్లకు రూ.3 వేల కోట్ల ఖర్చు అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు.

Advertisement
Advertisement