మట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి
మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు, జనవరి 21: ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌ది కపట ప్రేమ అని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవా రం ఎమ్మిగనూరులో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెబుతున్నారని, ప్రజలపై విధించిన పన్నులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తాను అఽధికారంలోకి వస్తే వారంలోపు బయోమెట్రిక్ రద్దు చేస్తానని, సీపీఎస్ రద్దు చేయిస్తానని చెప్పారని వాటిని చేయకపోగా ఐఆర్‌కంటే తక్కువ పీఆర్సీ ఇవ్వటం చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఘనత జగన్‌కే దక్కిందన్నారు. ప్రతిపక్షాల మాటవిని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం లోకి వచ్చి 30 నెలలు అవుతున్నా ఏనాడైనా సమయానికి జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారా అని ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే సీఎం జగన్ మడమ తిప్పడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న వారికి రూ.లక్షల వేతనం ఇస్తూ.. నిత్యం ప్రజల సేవలో ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు వేతనా లు పెంచకుండా ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాని డిమాండ్ చేశారు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దేశాయ్ మాధవరావ్, వెంకటరామిరెడ్డి, సోమేశ్వరరెడ్డి, సుందరరాజు, చేనేత మల్లి, గుల్లా సలాం, వెంకటరెడ్డి, డీలర్ ఈరన్న, దేవేంద్ర, దేవదాసు, సురేష్‌లు పాల్గొన్నారు.