ఎండీయూ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ

ABN , First Publish Date - 2022-05-22T06:40:39+05:30 IST

తమ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఎండీయూ ఆపరేటర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్‌కుమార్‌ తెలిపారు.

ఎండీయూ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ
మీడియాతో మాట్లాడుతున్న కిషోర్‌కుమార్‌ తదితరులు

తిరుపతి(కొర్లగుంట), మే 21: తమ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఎండీయూ ఆపరేటర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్‌కుమార్‌ తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం సీఎంను కలసి తమ సమస్యలను తెలియజేశామన్నారు. ఏపీ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ అగ్రిమెంట్‌లో చెప్పిన విధంగా ఆరేళ్లకు బీమా మొత్తాన్ని పౌరసరఫరాలశాఖ చెల్లించాలి.. బియ్యం పంపిణీ సమయంలో ఆపరేటర్లతోపాటు వలంటీర్లు ఉండేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలి.. ఆరోగ్య భద్రత, ఆపరేటర్లకు నామినీ సౌకర్యం కల్పించాలి.. అందరికీ సమానంగా కార్డుల సంఖ్య అమలు చేయాలి.. తదితరాలపై విన్నవించగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. కాగా తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేసిన మంత్రి కె.నాగేశ్వరరావు, ఎండీ వీరపాండియన్‌లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సంఘ ప్రతినిధులు పార్థసారథి, తోటకుమార్‌, కుప్పయ్య, నాగయ్య, సుబ్బారావు, సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:40:39+05:30 IST