పంజాబ్ సీఎం చన్నీ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-02-15T15:27:30+05:30 IST

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ హెలికాప్టరుకు విమానయానశాఖ అధికారులు బ్రేక్ వేశారు....

పంజాబ్ సీఎం చన్నీ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరణ

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ హెలికాప్టరుకు విమానయానశాఖ అధికారులు బ్రేక్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా చండీఘడ్ లో నో ఫ్లై జోన్ విధించడంతో సీఎం చన్నీ హెలికాప్టరును టేకాఫ్ చేయడానికి అధికారులు అనుమతించలేదు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం చన్నీ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను హోషియార్‌పూర్‌లో ల్యాండ్ చేయడానికి అనుమతించారు.మరోవైపు జలంధర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.


పంజాబ్ సీఎం చన్నీ హోషియార్ పూర్ రావడానికి హెలికాప్టరును అనుమతించక పోవడంపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ జాఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.అధికార కాంగ్రెస్ పార్టీ శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది.


Updated Date - 2022-02-15T15:27:30+05:30 IST