ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కొత్తగా తన మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి మంగళవారంనాడు శాఖలు కేటాయించారు. తన వద్ద 14 శాఖలు ఉంచుకున్నారు. విద్యుత్, విజిలెన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, జస్టిస్, సివిల్ ఏవియేషన్, పర్యావరణం, లీగ్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్, మైనింగ్ అండ్ జియాలజీ, ఎక్సైజ్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, హాస్పిటాలిటీ, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు వంటి శాఖలు ఆయన వద్దే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధ్వాకు హోం శాఖ, కార్పొరేషన్, జైళ్ల శాఖలను కేటాయించారు. మరో ఉప ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ సోనికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రక్షణ సేవలు, స్వాతంత్ర్య సమరయోధుల సంక్షేమం శాఖలు కేటాయించారు.