క‌రోనా క‌ట్ట‌డి ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉంది: సీఎం

ABN , First Publish Date - 2020-08-02T16:02:53+05:30 IST

కరోనావైరస్ క‌ట్ట‌డి కోసం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రస్తావిస్తూ...

క‌రోనా క‌ట్ట‌డి ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉంది:  సీఎం

చండీగఢ్‌: కరోనావైరస్ క‌ట్ట‌డి కోసం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రస్తావిస్తూ, రాష్ట్ర భద్రత ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. ప్రజలు నిబంధనలను పాటించకపోతే రాష్ట్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వ‌స్తుంద‌ని ఆయన హెచ్చరించారు. పంజాబ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. శనివారం అత్య‌ధికంగా 4,900 కేసులు న‌మోద‌య్యాయి. ఆగస్టు 5 నుంచి జిమ్‌లు తెరుస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. అదేవిధంగా కరోనా నుంచి కోలుకున్న వారికి ప్లాస్మా దానం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ప్లాస్మా బ్యాంక్ పనిచేస్తోంద‌ని, త్వరలో మరో రెండు ప్రారంభం కానున్నాయ‌న్నారు. కాగా పంజాబ్‌లో క‌రోనా కేసులు 17 వేల సంఖ్య‌ను దాట‌గా, ఇప్పటివరకు 405 మంది మృతిచెందారు.

Updated Date - 2020-08-02T16:02:53+05:30 IST