CMతో యత్నాళ్‌, ఆనంద్‌సింగ్‌ కీలక భేటీ

ABN , First Publish Date - 2022-02-04T17:01:33+05:30 IST

విజయనగర జిల్లా ఇన్‌చార్జి పదవి చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పర్యాటక శాఖా మంత్రి ఆనంద్‌సింగ్‌ నగరంలో గురువారం ముఖ్యమంత్రి బొమ్మైతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను

CMతో యత్నాళ్‌, ఆనంద్‌సింగ్‌ కీలక భేటీ

బెంగళూరు: విజయనగర జిల్లా ఇన్‌చార్జి పదవి చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పర్యాటక శాఖా మంత్రి ఆనంద్‌సింగ్‌ నగరంలో గురువారం ముఖ్యమంత్రి బొమ్మైతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో అసమ్మతి నేతగా ముద్రపడ్డ బసవన గౌడ పాటిల్‌ యత్నాళ్‌ కూడా పాల్గొన్నారు. ద్రాక్షరైతుల సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిసినట్లు యత్నాళ్‌ చెబుతున్నప్పటికీ తాజా రాజకీయాల గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. యత్నాళ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని ఆనంద్‌సింగ్‌ కూడా సీఎంకు సిఫార్సు చేశారని, ఆనంద్‌సింగ్‌కు కీలకశాఖ ఇవ్వాలని యత్నాళ్‌ సూచించారని తెలుస్తోంది. అయితే విస్తరణ లేదా ప్రక్షాళనో త్వరలో తేలనుండడంపై అందరి దృష్టి పడింది.

Updated Date - 2022-02-04T17:01:33+05:30 IST