‘అమ్మ’ మాటను నెరవేర్చడంలో కృతకృత్యులయ్యాం : సీఎం

ABN , First Publish Date - 2021-04-12T21:04:58+05:30 IST

నక్సలైట్ చెరలోంచి కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలలో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తులను సీఎం భూపేష్

‘అమ్మ’ మాటను నెరవేర్చడంలో కృతకృత్యులయ్యాం : సీఎం

ఛత్తీస్‌గఢ్ : నక్సలైట్ చెరలోంచి కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలలో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తులను సీఎం భూపేష్ సింగ్ బాఘేల్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రాకేశ్వర్‌ను నక్సల్స్ కిడ్నాప్ చేసిన సమయంలో నేను వారి కుటుంబ సభ్యులను పరామర్శించా. అప్పుడు వాళ్ల అమ్మ నాతో మాట్లాడారు. నా కొడుకును క్షేమంగా తీసుకురావాలని కోరారు. వాళ్ల అమ్మ కోరికను నెరవేర్చడంలో మేము కృతకృత్యులయ్యాం. ఆయనను క్షేమంగా తీసుకొచ్చాం. ఈ ఘటన వెనుక పాత్రికేయులు, అధికారులు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. వారందరికీ నా ధన్యవాదాలు’’ అని సీఎం బాఘేల్ ప్రకటించారు. 


Updated Date - 2021-04-12T21:04:58+05:30 IST