‘ఆయన వాస్తవాలు మాట్లాడరు’

ABN , First Publish Date - 2022-03-12T17:27:19+05:30 IST

శాసనసభలో తరచూ వాగ్వాదాలు, విమర్శలతో పాటు ఒకరినొకరు హాస్యంగానే ఎత్తిపొడుచుకుంటుంటారు. ఇలాంటి సన్నివేశమే శుక్రవారం చోటుచేసుకుంది. ప్రతిపక్షనేత సిద్దరామయ్యను

‘ఆయన వాస్తవాలు మాట్లాడరు’

                       - సీఎం బొమ్మై ఎద్దేవా


బెంగళూరు: శాసనసభలో తరచూ వాగ్వాదాలు, విమర్శలతోపాటు ఒకరినొకరు హాస్యంగానే ఎత్తిపొడుచుకుంటుంటారు. ఇలాంటి సన్నివేశమే శుక్రవారం చోటుచేసుకుంది. ప్రతిపక్షనేత సిద్దరామయ్యను ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై పొగడుతూనే ఘాటుగా విమర్శించారు. సిద్దరామయ్య రాజకీయ జీవనం పోరాటాలతో సాగిందని, కానీ ఇటీవల ఆయన వాస్తవాలు మాట్లాడం లేదన్నారు. ప్రజల నాడి తెలిసేది ఎన్నికల వేళ మాత్రమే అన్నారు. ఎటువంటి నాయకులు ఓటమి చెందారో తెలియదా అంటూ పంజాబ్‌ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. యడియూరప్ప, కుమారస్వామి వారి అబ్బసాక్షిగా ముఖ్యమంత్రులు కాలేరని సిద్దరామయ్య పదేపదే వ్యాఖ్యానించేవారన్నారు. కానీ వీరు ఇరువురూ సీఎంలు అయ్యారన్నారు. అధికారంలో ఉండేవారే మరోసారి గెలిచారంటున్నారని, మరి పంజాబ్‌లో ఎందుకు చిత్తుగా ఓడారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతలం తా ప్రచారాలు చేసినా ఎన్ని సీట్లు వచ్చాయని ప్రశ్నించారు. రాజకీయాలు చేసేది అధికారంలోకి వచ్చేందుకేనని, ఎవరూ ఓడేందుకు పోటీ చేయరని ప్రజల తీర్పు అంతిమమనేది తెలుసుకోవాలన్నారు. ఐదురాష్ట్రాల ఫలితాల తర్వాత బీజేపీ అధికారంలో ఉండే చోటున మాత్రమే గెలిచారని సిద్దరామయ్య వ్యాఖ్యలు ఏవిధంగా సమంజసమన్నారు. పంజాబ్‌లో అధికారంలో ఉండి ఎందుకు కనీస సీట్లు పొందలేక పోయారనేది తెలుసుకుంటే ప్రజలు కాంగ్రెస్‌ను ఏ రీతిన అర్థం చేసుకున్నారో తెలుస్తుందన్నారు. 

Updated Date - 2022-03-12T17:27:19+05:30 IST