బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై లండన్ పర్యటన రద్దయింది. ఈనెల 19న సీఎం లండన్ వెళ్లాల్సి ఉండేది. 21వ తేదీ వరకూ దావోస్ లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు సీఎం వెళ్లాల్సి ఉండేది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్ సహా ప్రత్యేక అధికారుల బృందం పాల్గొనాల్సి ఉండేది. ముఖ్యమంత్రి మినహా ఇతరులంతా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో రాజ్యసభ, ఎమ్మెల్సీల ఎన్నికలతో పాటు మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం పెద్దలు ఏ క్షణంలోనైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు అనే సంకేతాలు ఇస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి లండన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి