రండి.. భాగస్వాములు కండి

ABN , First Publish Date - 2022-05-26T17:57:41+05:30 IST

రాష్ట్ర విజయపరంపరలో భాగస్వామ్యులు కావాలని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక ద్వారా 18 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి

రండి.. భాగస్వాములు కండి

- గరిష్ఠ ప్రయోజనాలు పొందండి

- దావోస్‌ వేదికగా పెట్టుబడిదారులకు సీఎం ఆహ్వానం 

- రూ.52 వేల కోట్ల ఒప్పందాలపై సంతకాలు 


బెంగళూరు: రాష్ట్ర విజయపరంపరలో భాగస్వామ్యులు కావాలని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక ద్వారా 18 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పిలుపునిచ్చారు. దావోస్‌ సదస్సులో మూడోరోజు బుధవారం ఆయన ప్రముఖ కంపెనీల అధినేతలను అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఇదే సందర్భంగా బెంగళూరులో నవంబరులో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలోనూ, బెంగళూరు టెక్‌ సమ్మిట్‌లోనూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య రంగానికి ఊతమిచ్చే దిశగా రెండు వేర్వేరు పాలసీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పరిశోధనలకు పెద్దపీట వేశామన్నారు. ఈ పాలసీ ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందాలని పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. దావోస్‌ పర్యటనలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి అమెరికాకు చెందిన ఇండియా స్పోరా సంస్థాపకుడు ఏఆర్‌ రంగస్వామితోను, సింగపూర్‌కు చెందిన ఇండోరమ అధ్యక్షుడు ప్రకాశ్‌ లోహియాతోనూ, జపాన్‌కు చెందిన హిటాచి మేనేజింగ్‌ డైరెక్టర్‌ భరత్‌ కౌశల్‌తోనూ, యూఏఈకి చెందిన వీపీఎస్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్‌ షంషీర్‌ వలయీల్‌తోనూ విస్తృతంగా సమాలోచనలు జరిపారు. యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అమితాబ్‌ చౌదరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యాసంస్థల ఆధునికీకరణకు తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భా గంగా చేయూత ఇవ్వాలని సీఎం చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఆధునిక సదుపాయాలు కల్పించే అం శంపై మరో విడత సమావేశం కావాలని తీర్మానించారు. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకుగా ఉన్న యాక్సిస్‌ కర్ణాటకలో తన శాఖలను మరింతగా విస్తరించుకోనుందని అమితాబ్‌ తెలిపారు. రాష్ట్రంలో టెలికామ్‌ ఉత్పాదనకు గణనీయ అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియో గం చేసుకోవాలని నోకియా సంస్థ ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో ఇప్పటికే నోకియాకు అతిపె ద్ద పరిశోధనా కేంద్రం ఉందని, ఏడు వేల మంది ఇందులో సేవలందిస్తున్నారని సీఎం వెల్లడించారు.పేపాల్‌ సంస్థకు చెందిన ప్రముఖులతోనూ సీఎం సమావేశమై డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను వేగిరం చేసేందుకు సహకారం కోరారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన బైజూస్‌ సం స్థ ప్రతినిధులతోనూ, మీ షో ఇ-కామర్స్‌ సంస్థ ప్రతినిధులతోనూ చర్చించారు. బెంగళూరులోని నాగసంద్రలో తన అత్యాధునిక కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఐకియా సంస్థ ముందుకు వచ్చిందని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి వెల్లడించారు. వరుసగా మూడు రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల అధినేతలతోనూ, వాణిజ్యరంగ దిగ్గజాలతోనూ సీఎం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయన్నారు. దావోస్‌ సదస్సులో రూ.52 వేల కోట్లకు పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరాయని, కాగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన హామీలు లభించాయని, ఇది శుభ సూచకమని నిరాణి దావోస్‌ నుంచి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2022-05-26T17:57:41+05:30 IST