Chief Minister: ఆర్‌ఎస్ఎస్‌ నిషేధం డిమాండ్‌ దురదృష్టకరం

ABN , First Publish Date - 2022-10-01T17:25:40+05:30 IST

దేశభక్తితోపాటు సామాజిక సేవల్లో పాలుపంచుకుంటూ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తున్న ఆర్‌ఎస్ఎస్‌ను బీజేపీ పాప

Chief Minister: ఆర్‌ఎస్ఎస్‌ నిషేధం డిమాండ్‌ దురదృష్టకరం

- నిస్వార్థ దేశసేవే ‘సంఘ్‌’ ధ్యేయం 

- దేశాన్ని చీల్చినవారే.. ‘జోడో’ నాటకం : సీఎం బొమ్మై


బెంగళూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశభక్తితోపాటు సామాజిక సేవల్లో పాలుపంచుకుంటూ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తున్న ఆర్‌ఎస్ఎస్‌ను బీజేపీ పాపపు కూపం అంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై సీఎం బొమ్మై మం డిపడ్డారు. హుబ్బళ్ళిలో శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఎస్ఎస్‌ను పీఎఫ్ఐతో పోల్చిన ఆలోచన సరికాదన్నారు. ఆర్‌ఎస్ఎస్‌ను నిషేధించాలన్న సిద్దరామయ్య డిమాండ్‌ అత్యంత దురదృష్టకరమైనదన్నారు. నిస్వార్థంగా దేశ సేవే సంఘ్‌ ధ్యేయమన్నారు. పీఎఫ్‌ఐను ఎం దుకు నిషేధించారని అడిగే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు. కొద్దికాలంగా దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ వ్యవహరించిన తీరును ప్రజలంతా గమనించారన్నా రు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీకి సంబంధించి స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే తొలిసారి అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుండడమే గొప్ప విశేషమన్నారు. విజయపురలో మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చెక్కలు చేసిన ఘనత కాంగ్రెస్‏కే దక్కుతుందని అలాంటి పార్టీ నేతలు ‘భారత్‌ జోడో’ పేరిట కొత్త నాటకానికి తెర లేపడం సిగ్గుచేటని అభివర్ణించారు. ఏడు దశాబ్దాలలో కాంగ్రె్‌సకు సాధ్యంకాని జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి, అయోధ్యలో రామాలయం వంటి అంశాలను అత్యంత సామరస్యంగా కొలిక్కి తెచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ప్రజలలో గందరగోళం రేపేందుకే ఈ యాత్రను తలపెట్టారని, తద్వారా కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకునేందుకు తెగ ఆరాట పడుతోందన్నారు. కాగా బెంగళూరులో శుక్రవారం మీడియాతో హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్‌ గిమ్మిక్కులు నడవబోవన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‏ను తిరస్కరిస్తున్నారన్నారు. ఉనికిని కాపాడుకోవడానికే రాహుల్‌ పాదయాత్ర చేపట్టారని, కాంగ్రెస్‌ మాయలకు జనం ఆకర్షితులు అయ్యే పరిస్థితి లేదన్నారు. 

Updated Date - 2022-10-01T17:25:40+05:30 IST