Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 24 2021 @ 11:56AM

‘ఎన్నికలప్పుడే ఆపార్టీకి మైనారిటీలు గుర్తుకొస్తారు’

                                     - CM బసవరాజ్‌ బొమ్మై 


బెంగళూరు(Karnataka): మైనారిటీలపై కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై విరుచుకుపడ్డారు. హానగల్‌లో శనివారం ఆయన పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐదేళ్లపాటు మైనారిటీలను బావిలో ఉంచి ఎన్నికలవేళ మాత్రమే వారిపై ఎక్కడలేని ప్రేమ, అప్యాయత కురిపించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. మైనారిటీలను కాంగ్రెస్‌ ఇంతకాలం దారితప్పిస్తూ వచ్చిందన్నారు. మోదీ అందరికోసం పనిచేస్తున్నారని, సంక్షేమ ఫలాలు కులమతాలతో నిమిత్తం లేకుండా అందిస్తున్నామన్నారు. మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌ పోటీ పడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు. హానగల్‌ పట్టణ శివారులో అత్యాధునిక బస్టాండ్‌, ట్రక్‌ టర్మినల్‌ నిర్మిస్తామని, పట్టణంలో అవసరమైనచోట్ల బస్‌ షెల్టర్‌లు ఏర్పాటు చేస్తామని, జన ఔషధి శాఖలను విరివిగా ఏర్పాటు చేస్తామని, సీసీ టీవీలతో భద్రతను కట్టుదిట్టం చేస్తామని, పరిశ్రమలను స్థాపించి ఉద్యోగాలు పెంచుతామని ఎన్నికల ప్రణాళికలో బీజేపీ హామీలు గుప్పించింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement