విజయనగరం నుంచే.. విజమ ఢంకా మోగించాలి

ABN , First Publish Date - 2022-04-17T16:42:05+05:30 IST

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నూతనంగా ఏర్పడిన విజయనగరం జిల్లా నుంచే విజయ ఢంకా మోగించాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌

విజయనగరం నుంచే.. విజమ ఢంకా మోగించాలి

- మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి

- ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పిలుపు

- హొసపేటలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం


బళ్లారి(బెంగళూరు): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నూతనంగా ఏర్పడిన విజయనగరం జిల్లా నుంచే విజయ ఢంకా మోగించాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పిలుపునిచ్చారు. విజయనగర కేంద్రమైన హొసపేట నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన రెండు రోజుల కార్యవర్గ సమావేశానికి శనివారం ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం మా ట్లాడుతూ విజయనగర సామ్రాజ్యం నుంచి విజయ యాత్ర ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో విజయనగర జిల్లా కేంద్రమైన హొసపేట నగరంలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. పార్టీ ప్రముఖుల్లో మనోబలం పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. ఈ దృఢ సంకల్పంతో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేస్తే రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, నవ కర్ణాటకతోపాటు నవ భారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ గడ్డిపరకను పట్టుకుని పోరాటం చేస్తోందన్నారు. దేశంలో కాం గ్రెస్‌ పార్టీ అవసాన దశకు చేరుకోవడంతో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోయే స్థితికి రాకతప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకులపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, త్వరలో ఆరోపణలన్నింటికి స్వస్తి పలుకుతామన్నారు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో కూడిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బీజేపీపై పోరాడడం హాస్యాస్పదమన్నారు. హిజాబ్‌ విషయంలో వివాదానికి కారణమైన వారికి వ్యతిరేకంగా మాట్లాడే దైర్యం లేక ఆ పార్టీ నాయకులు వెనకడుగు వేశారన్నారు. కాంగ్రెస్‌ కాలంలో పోలీసు అధికారి వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్నా అప్పట్లో కేసును మూసివేసే ప్రయత్నం చేశారన్నారు. ఎఫ్‌ఐఆర్‌ కోర్టుకు వెళ్లే వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయకపోవడాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మంత్రులు శశికళ జొల్లె, ఆనంద్‌ సింగ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, ఇతర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-17T16:42:05+05:30 IST