ఆ పార్టీ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు

ABN , First Publish Date - 2022-02-23T16:50:09+05:30 IST

కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని, రాష్ట్రంలో ఏం జరిగినా రాజకీయం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా డిమాండ్‌తో శాసనసభ ఉభయసభల్లో మంగళవారం కూడా కాంగ్రెస్‌ తన

ఆ పార్టీ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు

- కాంగ్రెస్‌ ప్రతీది రాజకీయం చేస్తోంది

- మార్చి 4న రాష్ట్ర బడ్జెట్‌: Cm Bommai


బెంగళూరు: కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని, రాష్ట్రంలో ఏం జరిగినా రాజకీయం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా డిమాండ్‌తో శాసనసభ ఉభయసభల్లో మంగళవారం కూడా కాంగ్రెస్‌ తన ధర్నాను కొనసాగించింది. ఒక పక్క ధర్నా కొనసాగుతుండగానే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలేకుండానే సీఎం బసవరాజ్‌ బొమ్మై సమాధానం ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. విధానపరిషత్‌లోనూ ఆయన కాంగ్రెస్‌ వైఖరిని తప్పుపట్టారు. ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్‌ పనికిరాదని తే ల్చిచెప్పారు. ఆరు రోజులుగా సభాకార్యకలాపాలు జరుగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం కాంగ్రె్‌సకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. హిజాబ్‌ విషయంలో కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టంచేయకుండా ధ్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని విమర్శించారు. శివమొగ్గలో హిందూ కార్యకర్త హత్య అనంతరం జరిగిన హింసాకాండ అత్యంత దురదృష్టకరమైనవన్నారు. ఈ ఘటనల్లో దోషులెవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలను కాపాడేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు. హైకోర్టులో హిజాబ్‌ కేసుపై తీవ్ర స్థాయిలోనే వాదవివాదాలు జరుగుతున్నాయని ఎలాంటి తీర్పు వచ్చినా అందరూ కట్టుబడి ఉండాలన్నారు. కాగా మార్చి 4న శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేలా బడ్జెట్‌ ప్రవేశపెడతానని సీఎం వెల్లడించారు.

Updated Date - 2022-02-23T16:50:09+05:30 IST