ఆయనకు చట్టంపై గౌరవం ఉండాలి: సీఎం

ABN , First Publish Date - 2022-01-07T17:46:20+05:30 IST

కొవిడ్‌ మార్గదర్శకాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది... పలు సంస్థలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి... కొవిడ్‌ ప్రభావాన్ని బట్టి మార్గదర్శకాలలో మార్పులు చేయదలచుకున్నాం... ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగిన సిద్దరామయ్య

ఆయనకు చట్టంపై గౌరవం ఉండాలి: సీఎం

బెంగళూరు: కొవిడ్‌ మార్గదర్శకాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది... పలు సంస్థలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి... కొవిడ్‌ ప్రభావాన్ని బట్టి మార్గదర్శకాలలో మార్పులు చేయదలచుకున్నాం... ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగిన సిద్దరామయ్యకు చట్టాలపట్ల గౌరవం ఉండాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అన్నారు. విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ... కరోనా నియంత్రణకు రెండు పర్యాయాలుగా కర్ణాటకలోనే కాకుండా దేశమంతటా లాక్‌డౌన్‌లు కొనసాగాయన్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలో కొవిడ్‌ చిత్రమే మారిపోయిందని, అంతకుమించి నిబంధనలు అమలు చేయకుంటే భవిష్యత్తు మరింత కఠినం కానుందన్నారు. డీకే శివకుమార్‌ నాటకంలో డైలాగుల తరహాలో మాట్లాడుతున్నారని, అందుకు సమాధానం చెప్పలేమన్నారు. ఎవరికైనా ఒకే విధమైన చట్టం ఉంటుందనేది తెలుసుకుంటే మేలన్నారు. 

Updated Date - 2022-01-07T17:46:20+05:30 IST