సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం

ABN , First Publish Date - 2021-10-19T08:24:26+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి విచ్చేశారు. సోమవారం సుమారు గంట సమయం ఆశ్రమంలోనే గడిపారు.

సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం

  • మరకత రాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు
  • గంటసేపు ఆశ్రమంలోనే గడిపిన జగన్‌


విజయవాడ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి విచ్చేశారు. సోమవారం సుమారు గంట సమయం ఆశ్రమంలోనే గడిపారు. ముందుగా గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ స్వామిని, ఆ తర్వాత మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆశ్రమ ప్రతినిధులు, వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. పూజల అనంతరం సీఎంకు స్వామీజీ శాలువా కప్పి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా  సచ్చిదానంద స్వామికి పలు విషయాలను సీఎం విన్నవించారు. సీఎం వెంట ఎంపీ విజయసాయి రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ అధికారి వాణీమోహన్‌ తదితరులున్నారు. 


రామరాజ్యం రావాలని ఆశీర్వదించా: సచ్చిదానంద 

రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకురావాలని సీఎంను ఆశీర్వదించానని గణపతి సచ్చిదానంద స్వామి మీడియాకు చెప్పారు. సీఎం, హిందుత్వానికి విరుద్ధమంటూ ప్రచారం జరగకూడదని భగవంతుడ్ని ప్రార్థించామని తెలిపారు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన జగన్‌కు ఉందని చెప్పారు.  ‘‘రామరాజ్యం ఒక్కరోజులో రాలేదు. ప్రభుత్వంతోపాటు ప్రజలు వలంటీర్లుగా పనిచేయాలి. ప్రతి చిన్న సమస్యకు ప్రభుత్వాన్ని నిందించడం తగదు’’ అని గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు.

Updated Date - 2021-10-19T08:24:26+05:30 IST