Abn logo
May 18 2021 @ 12:42PM

మత్సకారులకు సీఎం జగన్ భరోసా నిధులు

అమరావతి: వైఎస్సార్ మత్స్యకారుల భరోసా ఆర్థిక సాయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ. 10వేలు అందించారు.  సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన లక్షా 19వేల మంది మత్స్యకారులకు ఆయన భరోసా ఇచ్చారు. చేపలవేట నిషేధ సమయంలో ఏటా రూ. 10 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు. వరుసగా నగదు జమచేయడం ఇది మూడో ఏడాదని అన్నారు. పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంలో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందన్నారు.

Advertisement
Advertisement
Advertisement