Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేదలకు అండగా సీఎం సహాయ నిధి

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి

నల్లగొండ రూరల్‌, డిసెంబరు 5: సీఎం సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జిల్లాని 35మందికి, రూ.15,73,000 విలువైన చెక్కులను ఆదివారం ఆయన నివాసంలో అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేస్తోందన్నారు. అందులో భాగంగానే విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి చొరవతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు మెడికల్‌ కళశాలలను మంజురయ్యాయన్నారు. ఇందుకు జగదీ్‌షరెడ్డికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎస్‌కే లతీఫ్‌, నర్సింహ, సైదిరెడ్డి, జిల్లేపల్లి ఇంద్ర, శంకర్‌, కంచర్ల శ్రావన్‌గౌడ్‌, యుగేందర్‌, అరుణ్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement