చిన్నారివైద్యానికి సీఎం సహాయనిధి

ABN , First Publish Date - 2021-04-17T06:21:58+05:30 IST

మండలకేంద్రమైన ముథోల్‌కు చెందిన రమేష్‌ కూతురు లౌకిక చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి నుండి రూ. 2 లక్షల 50 వేలు ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో బాలిక తండ్రికి అందజేశారు.

చిన్నారివైద్యానికి సీఎం సహాయనిధి
చిన్నారి తండ్రికి ఎల్‌వోసీ లేఖను అందజేస్తున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

ముథోల్‌, ఏప్రిల్‌, 16 : మండలకేంద్రమైన  ముథోల్‌కు చెందిన రమేష్‌ కూతురు లౌకిక చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి నుండి రూ. 2 లక్షల 50 వేలు ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో బాలిక తండ్రికి అందజేశారు. వివరాల్లోకి వెళితే ముథోల్‌కు చెందిన రమేష్‌ ముథోల్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తన రెండు సంవత్సరాల కుమార్తె అయిన లౌకికు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించారు. అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో దీంతో మెరుగైన చికిత్స కోసం డబ్బులు అవసరమయ్యాయి. పేదకుటుంబం కావడంతో రమేష్‌ స్థానిక ఎంపీపీ అయే ష అప్రోజ్‌ఖాన్‌కు విన్నవించడంతో ఈ విషయాన్ని ఎంిపీపీ ముథోల్‌ ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే బాలిక మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయనిధి నుండి రూ. 2 లక్షల 50 వేలను మంజూరు చేయించారు. సంబంధిత ఎల్‌వోసీ లెటర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో బాలిక తండ్రికి అందజేశారు. ఈ సంద ర్భంగా బాలిక కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.     


Updated Date - 2021-04-17T06:21:58+05:30 IST