సీఎం రాక.. అమ్మవారి దర్శనం బంద్‌!

ABN , First Publish Date - 2022-09-27T06:57:53+05:30 IST

సీఎం జగన్‌ వస్తున్నారని ఏకంగా అమ్మవారి దర్శనాలే ఆపేసిన ఉదంతమిది. తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సీఎం మంగళవారం సాయంత్రం రానున్నారు. ఇందుకోసం ఉదయం నుంచే..

సీఎం రాక.. అమ్మవారి దర్శనం బంద్‌!

తిరుపతి గంగమ్మ గుడి అధికారుల అతి

జగన్‌ వచ్చేది నేటి సాయంత్రం కానీ ఉదయం నుంచే

భక్తులకు దర్శనాలు ఉండవు రాత్రి ఏడున్నర తర్వాతే అవకాశం


తిరుపతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ వస్తున్నారని ఏకంగా అమ్మవారి దర్శనాలే ఆపేసిన ఉదంతమిది. తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సీఎం మంగళవారం సాయంత్రం రానున్నారు. ఇందుకోసం ఉదయం నుంచే భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ సోమవారం రాత్రి ప్రకటన జారీ చేయడంతో భక్తులకు నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కావడం లేదు. తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం మంగళవారం సాయంత్రం తిరుపతి రానున్నారు. 4.35 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గంగమ్మ ఆలయానికి వస్తారు. ఈ ఆలయ అభివృద్ధిపై కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మంగళవారం తిరుపతి వస్తున్న సీఎం ఎమ్మెల్యే ఆహ్వానం మేరకే ఆలయాన్ని సందర్శించనున్నారు. మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. మొత్తంమీద సీఎం గంగమ్మ ఆలయంలో గరిష్ఠంగా అరగంట ఉంటారేమో! ఆ మాత్రం దానికి ఆలయ నిర్వాహకులు ఉదయం నుంచే భక్తులకు అమ్మవారి దర్శనాలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2022-09-27T06:57:53+05:30 IST