తొలి వ్యాక్సీన్ నేనే వేసుకుంటా: పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2020-12-03T01:57:19+05:30 IST

పంజాబ్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలి టీకా తానే వేయించుకుంటానని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు...

తొలి వ్యాక్సీన్ నేనే వేసుకుంటా: పంజాబ్ సీఎం

చండీగఢ్: పంజాబ్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలి టీకా తానే వేయించుకుంటానని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.  భారత్‌లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు తుదిదశకు చేరుకున్న తరుణంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాక్సిన్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతులు రాగానే తానే ముందుగా స్వీకరిస్తానని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వ సన్నద్ధత తదితర అంశాలపై ఇవాళ ముఖ్యమంత్రి వర్చువల్ కేబినెట్ సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై భారత ప్రభుత్వ వ్యూహాన్ని అనుసరించి ముందుగా ఆరోగ్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఇస్తామని సీఎం తెలిపారు. 

Updated Date - 2020-12-03T01:57:19+05:30 IST