Abn logo
Sep 16 2021 @ 10:34AM

Pak terrorists arrest: పంజాబ్ రాష్ట్రంలో హైఅలర్ట్

చండీఘడ్: పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అరెస్టు చేసిన తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ జిల్లాలో గత నెలలో జరిగిన పేలుడులో పాల్గొన్న పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో పోలీసుబలగాలను సీఎం అప్రమత్తం చేశారు.గత 40 రోజుల్లో పాక్ టెర్రర్ మాడ్యూల్ ను ఛేదించిన నాల్గవ కేసు.పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా చేస్తున్న ప్రయత్నాలను గమనించిన సీఎం అమరీందర్ సింగ్ హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని మార్కెట్లలో భద్రతను పెంచాలని సీఎం డీజీపీని ఆదేశించారు.పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఖాసిమ్‌తో సహా ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను కూడా గుర్తించారు.సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఉగ్రవాదుల కదలికలను గుర్తించి వారిని అణచివేయాలని సీఎం అమరీందర్ ఆదేశించారు.


ఇవి కూడా చదవండిImage Caption