సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

ABN , First Publish Date - 2021-10-19T05:55:18+05:30 IST

సీఎం సహాయనిధి పథకం నిరుపే దలకు వరమని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 18 : సీఎం సహాయనిధి పథకం నిరుపే దలకు వరమని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌, మల్లెశ్వరీలకు మంజూ రైన రూ. 1.13 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను సోమ వారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేతుల మీదు గా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్ర భుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని వివరిం చారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించలేదని కేవలం తెలంగాణ ప్రభు త్వం మాత్రమే నిరుపేదలకు అండగా నిలిచి ఆదుకుందని పేర్కొన్నారు.


Updated Date - 2021-10-19T05:55:18+05:30 IST