ముఖ్యమంత్రికి అగ్రి వర్సిటీ వీసీ నియామక అధికారం

ABN , First Publish Date - 2022-05-11T15:49:37+05:30 IST

రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాలతో పాటు అంబేడ్కర్‌ లా యూనివర్సిటీ ఉపకులపతులను నియమించే అధికారాన్ని ఇప్పటికే గవర్నర్‌కు తొలగించిన రాష్ట్ర ప్రభు

ముఖ్యమంత్రికి అగ్రి వర్సిటీ వీసీ నియామక అధికారం

- గవర్నర్‌కు ఉన్న అధికారం తొలగింపు

- అసెంబ్లీలో ప్రత్యేక ముసాయిదా తీర్మానం


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాలతో పాటు అంబేడ్కర్‌ లా యూనివర్సిటీ ఉపకులపతులను నియమించే అధికారాన్ని ఇప్పటికే గవర్నర్‌కు తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ నియామక అధికారాన్ని కూడా తొలగించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం అసెంబ్లీలో ప్రత్యేక ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ముసాయిదాలో 1949 సంవత్సరం గుజరాత్‌ విశ్వవిద్యాలయ చట్టం, 1991 తెలంగాణ విశ్వవిద్యాలయ చట్టం యూనివర్సిటీలకు వైస్‌ చాన్సలర్లను నియమించే అధికారం ముఖ్యమంత్రికి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ చట్టాల ద్వారా ఆ తరహా అధికారాన్ని ఆయా ప్రభుత్వాలు పొందాయన్నారు. ఈ చట్టాల తరహాలోనే ప్రభుత్వం కూడా ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆ చట్టం మేరకు కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిని నియమించే అధికారం ముఖ్యమంత్రికి సంక్రమించిందన్నారు. 

Read more