‘క్లస్టర్‌’ కష్టాలు

ABN , First Publish Date - 2022-06-27T04:53:30+05:30 IST

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనా క్లస్టర్‌ యూనివర్సిటీ పాలన గాలిలో ఉగిసలాడుతోంది.

‘క్లస్టర్‌’ కష్టాలు

  1.  సిబ్బంది, ఉద్యోగుల నియామకాలు ఎప్పుడో
  2.  నిధులు సరే.. నిర్మాణాల సంగతేంటి?
  3.  అస్తవ్యస్తంగా పాలన వ్యవహారాలు...

కర్నూలు(అర్బన) జూన 26: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనా క్లస్టర్‌ యూనివర్సిటీ పాలన గాలిలో ఉగిసలాడుతోంది. దక్షిణ భారత దేశంలో మొదటి క్లస్టర్‌ యూనివర్సిటీ కర్నూలు నగరంలో ఏర్పాటైంది. సిల్వర్‌ జూబ్లీ కళాశాలను క్లస్టర్‌లో చేర్చడంతో యూనివర్సిటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలను కూడా చేర్చారు. నిధులు, నియామకాలు, సరైన బోధన, వసతులు లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఫ 2010లోనే క్లస్టర్‌ యూనివర్సిటీ దిశగా... క్లస్టర్‌ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపాదనలు 2010 లోనే సిద్ధమయ్యాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా 2016లో నిధులు కేటాయిచింది. 2018లో కేవీఆర్‌, సీల్వర్‌ జూబ్లీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల్లో భవన నిర్మాణాల కోస     ం రూసా గ్రాంట్స్‌ కింద రూ. 55 కోట్లు కేటాయించింది. ఫలితంగా ఆయా కళాశాలల్లో బోధనకు అవసరమైన భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. దేశంలో 3వ క్లస్టర్‌ యూనివర్సిటీగా 2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020-21లో విద్యా సంవత్సరంలో సిల్వర్‌జూబ్లీ కళాశాలలోనే తరగతులు ప్రారంభమయ్యాయి. పర్యవేక్షణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం జగన్నాథగట్టుపై 50 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, రూ.88 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత జనవరి 10న క్లస్టర్‌ యూనివర్సిటీ సొంత భవనాల కోసం రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో భవన నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడో.. కార్యకలాపాలు సాగేదెన్నడో అన్న చందంగా పరిస్థితి కనిపిస్తోందని కొందరు అధ్యాపకులు, విద్యార్థులు వాపోతున్నారు.

 నియామకాలు గాలిలోనే.. 

యూనివర్సిటీ అవిర్బవించి రెండేళ్లు పూర్తయింది. ఇంత వరకు సిబ్బంది లేరు. సీల్వర్‌ జూబ్లీ కళాశాలలో తాత్కాలికంగా క్లస్టర్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సొంత భవనం, సిబ్బంది నియామకాలు లేవు. తాత్కాలికి యూనివర్సిటీలో ఉపకులపతి, రిజిసా్ట్రర్‌ మాత్రమే కార్యాలయానికి పరిమితమైయ్యారు. మూడు కళాశాల నుంచి కొంత మంది అధ్యాపకులు, సిబ్బందిని డిప్యూటేషనపై వాడుకుంటున్నారు. ఈ క్రమంలో క్లస్టర్‌ యూనివర్సిటీకి 92 మంది నాన టిచింగ్‌, 42 మంది ప్యాకల్టీ ఉద్యోగుల నియామకానికి సంబందించిన ప్రతిపాధనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం వద్దే వీటికి సంబందించిన దస్త్రం మగ్గుతోంది.. 

అరకొర నిధుల కేటాయింపు.. 

ఈ ఏడాదీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో కేవలం రూ.1.20 కోట్ల నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంది. స్లిల్వర్‌ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నిర్మాణాలకు సంబంధించి ‘రూసా’ గ్రాంట్స్‌ కింద 55 కోట్లు కేటాయించారు. నిర్మాణాలు చివరి దశలో ఉన్నా రూ. 55 కోట్ల బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్లస్టర్‌ పేరుతో ఏర్పాటైన కొత్త యూనివర్సిటీకి నిధులు లేకపోతే చదువులు సాగేదేలా.. అంటూ విద్యార్థులు వాపోతున్నారు. 

  త్వరలో నియామకాలు

ప్రభుత్వానికి బోధన, భోధనేతర సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాం. త్వరలో భర్తీకి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం సిల్వర్‌ జూబ్లీ కళాశాల నుంచి పాలక వ్యవహారాలు కొనసాగిస్తున్నాం. డిగ్రీ కళాశాలల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యుటేషనపై పిలుపించుకుని పనులు ఇబ్బంది లేకుండా చూడగలుతున్నాం. 

 - ప్రొఫెసర్‌ సాయి గోపాల్‌,  ఉపకులపతి, క్లస్టర్‌ యూనివర్సిటీ


Updated Date - 2022-06-27T04:53:30+05:30 IST