క్లబ్‌ హౌస్‌ ఓపెన్‌ టు ఆల్‌

ABN , First Publish Date - 2021-07-24T05:44:16+05:30 IST

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ ‘క్లబ్‌ హౌస్‌’ ఆరంభించిన ఏడాదికే మంచి ఆదరణ పొందింది. ఇన్వైటీ యాప్‌ ఉంటే సభ్యులను ఇంతవరకు ఆహ్వానించేవారు.

క్లబ్‌ హౌస్‌ ఓపెన్‌ టు ఆల్‌

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ ‘క్లబ్‌ హౌస్‌’ ఆరంభించిన ఏడాదికే మంచి ఆదరణ పొందింది. ఇన్వైటీ యాప్‌ ఉంటే సభ్యులను ఇంతవరకు ఆహ్వానించేవారు. ఇప్పుడిక ఇది ఓపెన్‌ టు ఆల్‌ అంటే అందరికీ చెందినదిగా మారింది. గతవారం చేపట్టిన చర్యల ప్రకారం, ప్రైవేటు మెసేజింగ్‌ ఫీచర్‌ - బ్లాక్‌ చానల్‌ను ఆరంభించింది. దీంతో వన్‌ టు వన్‌, గ్రూపుల్లోనూ లింక్‌లను పంపుకోవచ్చు. మొదట దీన్ని ఆరంభించేందుకు పేపర్‌ విమానం మాదిరి ఐకాన్‌ను గుర్తించాలి. ఎవరిదైనా సరే, ప్రొఫైల్‌ పేజ్‌ లేదంటే మెయిన్‌ మెనూలో రైట్‌ స్వైప్‌ చేసి ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో మెసేజ్‌లను డిలీట్‌ చేసే అవకాశం లేదు. అందువల్ల మెసేజ్‌లను ఒకటికి  రెండుసార్లు సరి చూసుకుని పంపుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-07-24T05:44:16+05:30 IST