ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలలో అతికష్టం మీద టీఆర్‌ఎస్ బయట పడి గెలిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో నైతికంగా కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేవలం 96 ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 242 ఓట్లు రావడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే.