క్లాత్ మాస్క్‌లు పెట్టుకుంటున్న వారికి ఈ సంగతి తెలుసా..?

ABN , First Publish Date - 2020-10-12T22:53:23+05:30 IST

కరోనా సోకకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చాలామంది ఫేస్ మాస్క్‌లు ధరిస్తున్నారు. మరికొందరు ఫేస్ మాస్క్‌లతో..

క్లాత్ మాస్క్‌లు పెట్టుకుంటున్న వారికి ఈ సంగతి తెలుసా..?

కరోనా సోకకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చాలామంది ఫేస్ మాస్క్‌లు ధరిస్తున్నారు. మరికొందరు ఫేస్ మాస్క్‌లతో పాటు ఫేస్ సీల్డ్‌లు కూడా పెట్టుకుంటున్నారు. ఈ ఫేస్ సీల్డ్‌ల సంగతి కాసేపు పక్కన పెడితే ఫేస్ మాస్క్‌ల గురించి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా చాలామంది క్లాత్ మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌లు ధరిస్తున్నారని.. ఇలా ధరిస్తున్న వారిలో చాలామంది క్లాత్ మాస్క్‌లను వాష్ చేయకుండా పదేపదే వినియోగిస్తున్నారని తెలిపింది.


ఇలా వాష్ చేయకుండా రోజుల కొద్దీ వినియోగించడం వల్ల కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటితో క్లాత్ మాస్క్‌లను వాష్ చేయాలని సూచించింది. ఇలా బాగా వేడి నీటితో క్లాత్ మాస్క్‌లను వాష్ చేసి మళ్లీ ధరించడం వల్ల వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది.

Updated Date - 2020-10-12T22:53:23+05:30 IST