ఒమిక్రాన్ వేళ కాటన్ మాస్క్ సురక్షితమేనా? ..

ABN , First Publish Date - 2021-12-30T10:02:39+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతటా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించడంలో కాటన్ మాస్క్‌లు ప్రభావవంతంగా పనిచేయడం లేదని..

ఒమిక్రాన్ వేళ కాటన్ మాస్క్ సురక్షితమేనా? ..

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతటా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కరోనా వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించడంలో కాటన్ మాస్క్‌లు ప్రభావవంతంగా పనిచేయడం లేదని.. వాటితో పోలిస్తే N95 లాంటి ఫ్యాబ్రిక్ మాస్క్‌లు ఎంతో మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




ఇటీవల అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యునివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో డాక్టర్ లియాని వెన్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ని ఎదుర్కోవడంలో కాటన్ మాస్క్‌లు విఫలమయ్యాయని, అవి కేవలం ముఖానికి అలంకరణగా మాత్రమే పనికొస్తున్నాయని అన్నారు. 




ఇతర ఆరోగ్య నిపుణులు కూడా కాటన్ లేదా బట్టలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ఒమిక్రాన్ లాంటి వైరస్‌ని సమర్ధవంతంగా ఎదుర్కోలేవని చెబుతున్నారు. కాటన్ మాస్క్‌లు కేవలం పెద్ద పెద్ద తుంపరలనే అడ్డకోగలవని మరోవైపు KN95, N95, KF94 లాంటి  ఫ్యాబ్రిక్ మాస్క్‌లు పెద్ద తుంపరులనే గాక చిన్న వాటిని కూడా  సమర్ధవంతంగా అడ్డుకుంటాయిని.. దాని వల్ల కరోనాని వ్యాపించకుండా నివారించవచ్చునని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


N95 లాంటి మూడు లేయర్లున్న మాస్క్‌లు కరోనా వ్యాప్తిని 95 శాతం వరకు ఎదర్కొంటాయని, కానీ కాటన్ లేదా బట్టలతో తయారు చేసిన మాస్క్‌లు 50 శాతం వరకే పరిమితమవుతున్నాయని వారు తెలిపారు. చలికాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కరోనా మొదటి దశ(ఫస్ట్ వేవ్) వచ్చిన సమయంలో ఈ N95 లాంటి మాస్క్‌లు మార్కెట్లో ఎక్కువగా లభించేవి కావు..కానీ ఇప్పుడు N95 మాస్క్‌లు ఎక్కడైనా దొరుకుతున్నాయి.  వీటితోనే ఒటిక్రాన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే సామాజిక దూరం, కరోనా టీకా తీసుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Updated Date - 2021-12-30T10:02:39+05:30 IST