బస్టాండ్‌ వద్ద పార్కింగ్‌ మూసివేత

ABN , First Publish Date - 2022-05-17T05:14:21+05:30 IST

బస్టాండ్‌ వద్ద పార్కింగ్‌ మూసివేత

బస్టాండ్‌ వద్ద పార్కింగ్‌ మూసివేత
మేడ్చల్‌ బస్టాండ్‌ వద్ద మూసేసిన పార్కింగ్‌

మేడ్చల్‌, మే 16: మేడ ్చల్‌ బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలం కొన్ని రోజులుగా మూసి ఉం చడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల నుంచి ప్రయాణికులు ద్విచక్రవాహనాలు, త్రీ, ఫోర్‌వీలర్లపై బస్టాం డ్‌ వరకు వచ్చి పార్కింగ్‌లో వాహనాలను పార్కు చేసి ప్రయాణా లు చేసే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారం  రోజులుగా పార్కింగ్‌  మూయడంతో బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లే  వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పార్క్‌ చేయాలో తెలియడం లేదు. పార్కింగ్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ డబ్బులు చెల్లించకపోవడంతో డిపో అధికారులు పార్కింగ్‌ స్థలానికి తాళం వేయించినట్లు సమాచారం. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పార్కింగ్‌ను తెరిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-17T05:14:21+05:30 IST