గ్రామోత్సవంతో ముగిసిన చెర్వుగట్టు జాతర

ABN , First Publish Date - 2021-02-25T06:32:23+05:30 IST

చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగ ంగా బుధవారం రాత్రి గజవాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంతో జాతర ముగిసింది.

గ్రామోత్సవంతో ముగిసిన చెర్వుగట్టు జాతర
గ్రామోత్సవంలో పాల్గొన్న ఆలయ చైర్మన్‌ అరుణారాజిరెడ్డి తదితరులు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 24 : చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగ ంగా బుధవారం రాత్రి గజవాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంతో జాతర ముగిసింది. పార్వతీపరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన గజవాహనంపై ఆసీనులను చేసి ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ప్రత్యేక పూ జలు నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం ప్రారంభమైంది. సన్నాయి వాయిద్యాలు, బాణసంచా కాలుస్తూ చెర్వుగట్టు, ఎల్ల్లారెడ్డిగూడెం పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు మంగళహారతులు పట్టి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. ఉత్సవంలో దేవస్థాన చైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, ధర్మకర్తలు, పసునూరి శ్రీనివాస్‌, రాధారపు భిక్షపతి, బూర్గు కృష్ణయ్య, మారుపాకల ప్రభాకర్‌రెడ్డి, వంపు శివ, బొబ్బలి దేవేందర్‌, కొండేటి వేణు, కల్లూరి శ్రీను, చిక్కుళ్ల యాదగిరి, కంకల యాదయ్య, చీర మల్లేష్‌, మేక వెంకట్‌రెడ్డి, దండు శంకరయ్య, దేవస్థాన సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, వల్లూరి శంకర్‌, శ్రీనివా్‌సరెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు గజవాహన సేవతో ముగిశాయి. ఉత్సవాలు నిర్విఘ్నంగా పూర్తవడంతో దేవస్థానంతో పాటు పోలీస్‌ ఇతర అనుబంధ ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఉత్సవాలు నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవస్థాన ట్రస్టుబోర్డు చైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, ఈవో మహేంద్రకుమార్‌  కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-02-25T06:32:23+05:30 IST