ఘనంగా ముగింపోత్సవం

ABN , First Publish Date - 2022-08-10T05:58:56+05:30 IST

దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ముగింపోత్సవం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది.

ఘనంగా ముగింపోత్సవం

చెన్నై (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ముగింపోత్సవం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పలువురు కళాకారులు చేపట్టిన సంగీత, నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. డ్రమ్స్‌తో శివమణి, వీణతో రాజేశ్‌వైద్యా, పియానో స్టీఫెన్‌ దేవసి, వేణువుతో మురళీ, ుభారతదేశ హృదయ స్పందన పేరుతో నిర్వహించిన సంగీత వాద్య కచేరీ ఆకట్టుకుంది. ఒలింపియాడ్‌ విజేతలకు పతకాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా భారతదేశపు మొదటి గ్రాండ్‌ మాస్టర్‌ మాన్యువల్‌ ఆరోన్‌కి జ్ఞాపికను బహూకరించి సత్కరించారు. 

Updated Date - 2022-08-10T05:58:56+05:30 IST