మూసివేత దిశగా ఆప్కో విక్రయశాలలు

ABN , First Publish Date - 2022-06-26T07:14:35+05:30 IST

ప్రభుత్వ ప్రోత్సాహం కరువై, వినియోగదారుల అభిరుచికి తగ్గ వస్త్రాలను అందించకపోవడం తోపాటు అమ్మకాలు తగ్గాయనే నెపంతో దశాబ్దాల తరబడి సేవలందించిన ఆప్కో చేనేత విక్రయశాలలు మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి.

మూసివేత దిశగా ఆప్కో విక్రయశాలలు
కొత్తపేటలో ఆప్కో విక్రయశాల.. ఆప్కో శాఖ మూసివేస్తున్నట్టు భవన యజమానికి పంపిన లేఖ

 ప్రభుత్వ ప్రోత్సాహం కరవు

 అమ్మకాలు తగ్గాయంటూ సాకు

కొత్తపేట, జూన్‌ 25: ప్రభుత్వ ప్రోత్సాహం కరువై, వినియోగదారుల అభిరుచికి తగ్గ వస్త్రాలను అందించకపోవడం తోపాటు అమ్మకాలు తగ్గాయనే నెపంతో దశాబ్దాల తరబడి సేవలందించిన ఆప్కో చేనేత విక్రయశాలలు మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆప్కో చేనేత వస్త్రాలయాన్ని కొత్తపేటలో మూసివేస్తున్నట్టు ఆ భవన యజమానికి సమాచార ఉత్తర్వులిచ్చారు. ఏపీ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్‌ పేరున రాజమహేంద్రవరం వారిపేర ఉత్తర్వులిచ్చారు. సొసైటీల ద్వారా ఆయా చేనేత వర్గాలకు చెందినవారితో తయారుచేయించి, ఆప్కో విక్రయశాఖల ద్వారా అమ్మ కాలు జరిపి వారికి జీవనోపాధి కల్పించడంతోపాటు వినియోగదారుల అభిరుచికి తగ్గ మగ్గంచీరలు, పట్టుచీర లు, దుప్పట్లు సరసమైన ధరలకు అందించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నపుడు ఈ శాఖకు మంచి గుర్తింపు ఉం డి ప్రత్యేకమైన వినియోగదారులు కలిగి ఉండేది. తెలంగాణలో తయారయ్యే పోచంపల్లి, గద్వాల, కరీంనగర్‌ దుప్పట్లకు మంచి గిరాకీ ఉండేదని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో తయారయ్యే వెంకటగిరి, మాధవరం, ఉప్పాడ మగ్గాల ద్వారా తయారయ్యే వస్త్రాల పంపిణీ మాత్రమే ఉంటోందని, అది కూడా రెండు నెలలకు మాత్రమే స్టాకు వస్తుందని తెలుస్తోంది. కొన్ని రకాల ఆప్కో చేనేతల అందు బాటులో లేకపోవడంతో వినియోగదారులు తగ్గుముఖం పట్టారు. దీనికితోడు ప్రభుత్వం అజమాయిషీ, ప్రోత్సాహం కూడా కరువవడంతో ఒక్కొక్కటిగా మూసివేత దిశగా అడుగులు  వేస్తోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఆప్కో విక్రయశాలను మూసివేశారు. కోనసీమ జిల్లా పరిధిలో అమలాపురం, మలికిపురం, రావులపాలెం, కొత్తపేటలో ఉండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 బ్రాంచి లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తపేట శాఖను మూసివేయాలని ఆ శాఖ భవన యజమానికి ఉత్తర్వులు ఇవ్వడం తో భవిష్యత్తులో ఆప్కో చేనేత విక్రయశాలలు దాదాపుగా మూసివేత దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. దీనిపై ఆధారపడ్డ చేనేత కార్మికుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది.




Updated Date - 2022-06-26T07:14:35+05:30 IST