Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగిసిన పవిత్రోత్సవాలు

వాల్మీకిపురం, అక్టోబరు 21: వాల్మీకిపురం పట్టాభి రామాలయంలో మూడు రోజులుగా టీటీడీ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న పవిత్రో త్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవ, ఆలయంలో మూలవర్లకు అభిషేకం, అర్చన తోమాలసేవలతో ప్రత్యేక పూజలు జరిగాయి. భోగోత్సవ మూర్తులైన సీతారామ లక్ష్మణులకు వేద పండితుల మంత్రోచ్ఛ రణల నడుమ స్నపన తిరు మంజనం వేడుకగా సాగింది. అనంతరం ఆలయ మండపంలో చక్రస్నానం నిర్వహించి ఉత్సవమూర్తులకు విశేష పూజల చేశారు. చివరగా పవిత్రాల విసర్జనతో ఉత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమాలలో టీటీడీ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధనుంజయులు, సూపరింటెండెంట్‌ మునిచెంగల్రాయులు, ఆగమ సలహాదారు మణికంఠ భట్టార్‌, ఆలయ అధికారి కృష్ణమూర్తి, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, కృష్ణప్రసాద్‌ భట్టార్‌, భాషికాచార్యులు, సిబ్బంది సిద్ధారెడ్డి, దిశాంత్‌ కుమార్‌, భక్తులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement