మూతపడిన ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2022-10-05T05:15:13+05:30 IST

మూతపడిన ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్లు

మూతపడిన ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్లు
అధికారుల తనిఖీల నేపథ్యంలో మూతపడిన ప్రథమ చికిత్స కేంద్రం

  • ప్రైవేట్‌ క్లినిక్‌ల తనిఖీల నేపథ్యంలో నిర్వాహకుల్లో భయం

నవాబుపేట, అక్టోబరు 4: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశానుసారం అధికారులు ప్రైవేట్‌ ఆస్పత్రులను తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మండల పరిధిలోని చించల్‌పేట్‌, అక్నాపూర్‌, ఏక్‌మామిడి, మముదాన్‌పల్లి, ఎల్లకొండ, మైతా్‌పఖాన్‌గూడ, నవాబుపేట తదితర గ్రామాల్లో వారం రోజులుగా ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లు తెరవడం లేదు. ప్రాక్టీస్‌ అనుమతులు లేకుండా, వచ్చీరాని వైద్యంతో క్లినిక్‌ లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో క్లినిక్‌లను తనిఖీ చేస్తున్నారు. దీంతో కొందరు పీఎంపీ, ఆర్‌ఎంపీలు క్లినిక్‌లకు తాళం వేస్తున్నారు.

Updated Date - 2022-10-05T05:15:13+05:30 IST