వాటంతట అవే క్లోజ్‌?

ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST

నా ఫోన్లో అప్లికేషన్స్‌ డౌన్లోడ్‌ చేసిన తరవాత ఓపెన్‌ చేస్తే వాటంతట అవే క్లోజ్‌ అవుతున్నాయి.

వాటంతట అవే క్లోజ్‌?

నా ఫోన్లో అప్లికేషన్స్‌ డౌన్లోడ్‌ చేసిన తరవాత ఓపెన్‌ చేస్తే వాటంతట అవే క్లోజ్‌ అవుతున్నాయి. కొన్ని అప్డేట్‌ కావడం లేదు. ఈ మధ్య నా ఫోన్‌ని రీసెట్‌ చేశాను. అప్పటినుంచి ఈ సమస్య.....  పరిష్కారం చెప్పగలరు.     

 - సంతోష్‌ కుమార్‌


గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మీరు డౌన్లోడ్‌ చేసే అన్ని అప్లికేషన్స్‌ బాగానే పనిచేస్తూ కేవలం ఒకటి రెండు మాత్రమే క్లోజ్‌ అవుతున్నట్లయితే,  ఆ యాప్స్‌ మీ ఫోన్‌కి కంపాటబుల్‌ అవడం లేదని గ్రహించాలి. అలా కాకుండా అన్ని అప్లికేషన్స్‌ వాటంతట అవే క్లోజ్‌ అవుతుంటే గూగుల్‌ ప్లే స్టోర్‌ క్యాచే విషయంలో సమస్య ఉన్నట్లు భావించాలి. అలాగే అప్లికేషన్స్‌ కూడా అప్డేట్‌ కావడం లేదు అంటున్నారు. అంటే కచ్చితంగా గూగుల్‌ ప్లే స్టోర్‌ అప్లికేషన్‌ క్యాఛే కరప్ట్‌ అయినట్లు తెలుస్తోంది. మీ ఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ అనే విభాగంలోని సిస్టమ్‌ యాప్స్‌ విభాగంలోకి వెళ్లండి. అందులో గూగుల్‌ ప్లేస్టోర్‌ వెతికి పట్టుకొని, క్లియర్‌ డేటా, క్లియర్‌ క్యాఛే అనే బటన్లని క్లిక్‌ చేయండి. ఇప్పుడు మీ గూగుల్‌ అకౌంట్‌తో మళ్లీ గూగుల్‌ ప్లే స్టోర్‌ లోకి లాగిన్‌ అవండి. అలా లాగిన్‌ అయిన తరవాత మీరు ఇంతకుముందు ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి.

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST