ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ABN , First Publish Date - 2021-03-07T07:02:15+05:30 IST

ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 22 గ్రామ పంచాయతీ ల్లోని 34 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

34 గ్రామ పంచాయతీ వార్డులకు 25 నామినేషన్లు 8 9 చోట్ల అభ్యర్థులు నిల్‌

16 చోట్ల సింగిల్‌ నామినేషన్లు 8 9 చోట్ల రెండు అంతకంటే ఎక్కువ దాఖలు 
కాకినాడ (ఆంధ్రజ్యోతి), మార్చి 6: ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 22 గ్రామ పంచాయతీ ల్లోని 34 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో ఈ వార్డుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రోజు ఆయా గ్రామ పంచాయతీల్లో 10, రెండో రోజు 5న 7, ముగింపు రోజు 6న 8.. మొత్తం 25 నామినేషన్లు దాఖలయ్యాయి. 9 చోట్ల నామినేషన్లు వేయలేదు. అయితే 16 స్థానాల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలవ్వడంతో ఇక్కడ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. 9 స్థానాల్లో 2 కంటే ఎక్కువ నామినేషన్లు వేయడంతో ఇక్కడ పోటీ అనివార్యం కానుంది. అయితే ఈనెల 7న నామినేషన్ల పరిశీలన, 8న తిరస్కరణ, అప్పీళ్లను పరిష్కరించనున్నారు. ఉపసంహరణకు 10వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఇచ్చారు. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 15వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Updated Date - 2021-03-07T07:02:15+05:30 IST