తుది దశలో పిల్లల వ్యాక్సిన్ ట్రయిల్స్.. హైకోర్టుకు తెలిపిన కేంద్రం

ABN , First Publish Date - 2021-07-16T23:50:01+05:30 IST

పద్దెనిమిదేళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌పై జరుపుతున్న ట్రయిల్స్ దాదాపు పూర్తి కావచ్చాయని..

తుది దశలో పిల్లల వ్యాక్సిన్ ట్రయిల్స్.. హైకోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌పై జరుపుతున్న ట్రయిల్స్ దాదాపు పూర్తి కావచ్చాయని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం శుక్రవారంనాడు తెలిపింది. నిపుణుల సంస్థ అనుమతులు ఇవ్వగానే సాధ్యమైనంత త్వరలో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేస్తామని పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌లో 12 నుంచి 18 ఏళ్ల లోపు వారిని చేర్చాలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టుకు కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. తన తల్లిద్వారా 12 ఏళ్ల పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడున్న ఓ మహిళ ఈ పిటిషన్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిల్లల వ్యాక్సిన్ కోసం యావద్దేశం ఎదురు చూస్తోందని డివిజన్ బెంచ్ పేర్కొంది. కేంద్రానికి మరింత సమయం ఇస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.

Updated Date - 2021-07-16T23:50:01+05:30 IST