పర్వతాల అధిరోహికుడు

ABN , First Publish Date - 2022-07-04T05:04:02+05:30 IST

గోనెగండ్లకు చెందిన సురేష్‌ ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తున్నాడు.

పర్వతాల అధిరోహికుడు
జూలై 2న యానమ్‌ పర్వతంపై తివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తున్న సురేష్‌

  1. ఇప్పటి వరకు 20 పర్వతాలను ఎక్కేశాడు
  2. జూలై 2న హిమాచల్‌ ప్రదేశలోని యానం శిఖరారోహణ
  3. కూలీ కుటుంబంలో కళికుతురాయి సురేష్‌ 

గోనెగండ్ల, జూలై 3: గోనెగండ్లకు చెందిన సురేష్‌ ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తున్నాడు. ఇప్పటి వరకు 20 పర్వతాలను ఎక్కేశాడు ఇందులో భాగంగా జూలై 2న హిమాచల్‌ప్రదేశలోని యానమ్‌(6111 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వత అధిరోహణ కోసం జూన నెల 19న కర్నూలు నుంచి హిమాచల్‌ప్రదేశకు బయలుదేరాడు. దేశంలోని పలు రాషా్ట్రల నుంచి మొత్తం 17 మంది ఈ ప్రయాణం సాగించారు. జూన 20 నుంచి జూలై 2వ తేదీ వరకు పర్వతారోహణ ప్రయాణం సాగింది. 2వ తేదీన యానమ్‌ పర్వతం చేరుకొని అక్కడ సురేష్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. 

గతంలో అధిరోహించిన పర్వతాలు: 

ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్టు  పర్వతాన్ని (8,848 మీటర్లు’ దట్టమైన మంచులో 2017 మే 13వ తేదీన ఎక్కాడు. అలాగే ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతం 2017 డిసెంబరు 25న, ఎంటీ ఎల్‌బ్రోష్‌ 2018 ఆగస్టు 5న, ఎంటీ మనసులు 2018 సెప్టెంబరు 29న, సౌత ఆఫ్రికాలోని అకోయకాగియా పర్వతం 2019 జనవరి 4, ఆసే్ట్రలియాలోని కోసిస్‌కో పర్వతం 2019 మార్చి 3న, నేపాల్‌లోని లోహిట్‌సీ పర్వతం 2019 మే 29న, ఇండియాలోని రుడుగైరా పర్వతం 2020 అక్టోబరు 19న, జమ్మూకశ్మీర్‌లోని కంగ్రీ పర్వతం 2021 జనవరి 15న మంగనకట్‌ పర్వతం 2021 ఏప్రిల్‌ 18న, టీస్‌టాపీక్‌ పర్వతం 2021 ఏప్రిల్‌ 22న, పటీల్స్‌ పర్వతం 2021 ఏప్రిల్‌ 25న అధిరోహించాడు. వీటితో పాటు మరో ఏడు పర్వతాలను కూడా ఎక్కినట్టు తెలిపాడు.

ఇంటర్‌ నుంచే ఆసక్తి: 

గోనెగండ్లకు చెందిన సురేష్‌ సీ బెళగల్‌ మండలంలో ఏపీ గురుకుల పాఠశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. 2016లో ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పట్లో సురేష్‌ పేరును పంపాడు. సీబీఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ సురేష్‌కు కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి పంపింది. అక్కడ నుంచి సరేష్‌ ఇక వెనుతిరిగి చూడలేదు. ప్రపంచంలోని అన్ని పర్వతాలను ఎక్కాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

చదువు, కుటుంబ నేపథ్యం.. 

గోనెగండ్లకు చెందిన కర్రెన్న, తల్లి సువర్ణమ్మ దంపతుల కుమారుడైన సురేష్‌ 5వ తరగతి వరకు గోనెగండ్ల, 6 నుంచి 10వ తరగతి వరకు అరికెరలో, ఇంటర్‌ సీ బెళగల్‌లో, డిగ్రీ కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో పూర్తి చేశాడు. ప్రస్తుతం శ్రీకృష్టదేవారాయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్‌ చేస్తున్నాడు. ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థి ప్రపంచంలోని దాదాపు 20 పర్వతానలు అధిరోహించడం అరుదైన విషయం. 

అధికారుల సహకారంతోనే: సురేష్‌: 

కర్నూలు కలెక్టర్‌ కోటేశ్వరరావు, సిల్వర్‌జూబ్లీ పూర్వ విద్యార్థులు తనకు సహకారం అందించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ సోమశేఖర్‌రెడ్డి, శోధన ల్యాబ్‌ సీఈవో గిరిధర్‌లకు తోడ్పాటునందించారు. వీరికి జీవితాంతం రుణపడి ఉంటా.


Updated Date - 2022-07-04T05:04:02+05:30 IST